Swarna Vitthala Ratha
“పంపాక్షేత్ర కిష్కింధా హంపి – విజయనగర మహాసామ్రాజ్య ” ఐతిహాసిక దివ్య దేవస్థానముల పునర్నిర్మాణము

31 కోట్ల సంవత్సరాల పౌరాణిక శ్రీ పంపాక్షేత్రము “పంపా పట్టణము” , త్రేతాయుగపు 12 లక్షల సంవత్సరాల “వానరుల” సామ్రాజ్యము శ్రీ కిష్కింధా నగరము 700 సంవత్సరాల శ్రీ విద్యా విజయనగర సామ్రాజ్యముల ఐతిహాసిక పౌరాణిక రాజధాని “శ్రీ పంపాక్షేత్ర కిష్కిందా హంపి క్షేత్రము ” జీర్ణోద్ధార పునర్వైభవ కార్యక్రమములలో భాగముగా పరమపూజ్య పంపాక్షేత్ర శ్రీ గోవిందానంద సరస్వతి స్వామివారి కారకమలములచే మూల హంపి అభివృద్ధి కార్యములలో భాగముగా మూలగ్రామమును అక్కడ నివాస స్థానములను తీసివేసినతరువాత అక్కడనుండి ఒక కిలోమీటరు దూరములో భగవత్ ప్రేరణతో క్షేత్ర గ్రామ ప్రజల పరిశ్రమతో వారి అభ్యర్ధనమేరకు క్షేత్ర పరిరక్షణకు అనేక కార్యక్రమములు ఆరంభవైనవి , వానిలో జగద్గురు శంకరాచార్య శ్రీ విద్యారణ్యులచే సనాతన హిందూ ధర్మ పరిరక్షణకై , దేశ పరిరక్షణకై స్థాపించిన విద్యానగర సామ్రాజ్య రాజధాని మూల క్షేత్రము హంపి గ్రామము “అస్థిత్వము లేకుండగా ఉండకూడదని ” మరల అక్కడ సకల గ్రామస్తులు ప్రయత్నములో భగవంతుని అనుగ్రహముతో కోర్ట్ ఆదేశముతో ఎంతోకాలంగా మూల హంపిలో నివసిస్తున్న ప్రజలు అక్కడి సంస్కృతిలో , నాగరికతలో , క్షేత్రములో అంతర్భాగము అటువంటి వారిని బలవంతముగా ఖాళి చేయించి పంపించుట తగదు అని కోర్ట్ ఆదేశముతో వారికి హంపిలోనే సకలవసతులతో కొత్త గ్రామము ఏర్పాటుచేయవలెనని ఆదేశముతో గ్రామస్తుల నివేదనతో 2013 లో పూజ్య శ్రీ గోవిందానంద సరస్వతి స్వామివారి కారకమలములచే కొత్త హంపి ( స్వర్ణ హంపి) గ్రామమునకు శిలాన్యాసముచేయటంజరిగినది ప్రస్తుతము మూల గ్రామము , మూల నివాసులు, మూల సంస్కృతి యథావట్టుగా రక్షింపబడినది
500 కుటుంబాలు తో నూతన హంపి గ్రామము క్రొత్తగా నిర్మింపబడినది , సంస్కృతి జీవంతముగా రక్షింపబడినది ,

అదే సమయములో భగవంతుని ప్రేరణతో గ్రామ జీర్ణోద్ధర స్థాపన తరువాత , అక్కడి దేవస్థానములు కూడా జీర్ణోద్ధర చేసి నూతనముగా నిర్మించి దేవతా మూర్తులను పున: ప్రతిష్ఠ చేసే కార్యములను శ్రీ పూజ్య స్వామివారు ఆరంభించినారు

అటువంటి ఐతిహాసిక కార్యక్రమములలో భాగముగా ” శ్రీ హనుమద్ జన్మభూమి కిష్కింధా అంజనాద్రి పోరాము దిగ్విజయము , అనేక ప్రదేశాలలో కిష్కింధా హనుమంతులవారి విగ్రహముల ప్రతిష్ఠాపన అదేరకముగా నూతన హంపి ” స్వర్ణ హంపి ” గ్రామములో “శ్రీ కిష్కింధా శ్రీ కార్యసిద్ధి హనుమాన్” మందిర నిర్మాణము , ఇలా అనేక కార్యక్రమములు ఆరంభమైనవి,

ఇటువంటి అభివృద్ధికార్యములలో భాగముగా 5300 సంవత్సరముల క్రితము శ్రీ కాశీ క్షేత్రమునుండి భగవాన్ వేదవ్యాసులవారు శ్రీ కృష్ణద్వైపాయనులు ఈ పంపాక్షేత్రమునకు వచ్చి సనాతన వైదిక , వేద ధర్మ , క్షేత్ర పరిరక్షణకై ఆశ్రమ గురుకులమును స్థాపించిరి పరమపూజ్య శ్రీ స్వామివారు ఆ గురుకులమును కూడా జీర్ణోద్ధారము చేసినారు , ప్రస్తుతము
విజయనగర సామ్రాజ్య కాలములో సుమారు 200 సంవత్సరాలుగా నిరంతరమూ నిర్మాణము జరిగిన ఐతిహాసిక పురాతన శిల్పకళావైభవాలతో కూడిన అనేక దివ్య మందిరాలు వైదేశికుల దండయాత్రలలో అతిదారుణముగా ధ్వంసము చేయబడినవి
ప్రస్తుతము వీటిన యునెస్కో , కేంద్ర రాజ్య పురావస్తు శాఖ వారు పర్యాటన , దేవాదాయ శాఖ , ప్రాధికారము , ఇంకా ఇతర ప్రభుత్వమువారు వాటి సంరక్షణకు అనేక ప్రయాసము చేయుచున్నారు, అభివృద్ధికి సకలప్రయత్నములు చేయుచున్నారు కానీ ప్రభుత్వ సిద్ధాంతము ప్రకారము వాటిని యథాతథముగానే ఉంచవలెనన్న వాదన అటు సమస్త భక్తుల మనసులో చాలాబాధాను కలిగిస్తూ వస్తున్నవి , ఎంతకాలము ఆ రకముగా అటువంటి విధముగా భగవంతుని ఆలయాలు శిధిలాలుగానే , జీర్ణ అవస్థలోనే ఉంచుతూ , చూస్తూ ఉండటమేనా అనే బాధ ఈ ఐతిహాసిక దేవస్థానములను చూసి కన్నీరు పెట్టని కన్నులెదు , అటు ప్రభుత్వములు దధార్మికముగా వీటిని అభివృద్ధిచేయుటకు విధానాలు , నియమాలు అటు ప్రభుత్వములోగాని , ఇటు చట్టములలోగాని లేవు , కానరావు , ఈ క్షేత్రమును కేవలము ఒక పర్యటనా స్థలముగా నే ప్రభుత్వములు , చట్టాలు , చూడగలవు తప్ప అంతకుమించి వారికి పరిధిలేదు , ఈ సమస్యని పరిక్షరించటానికి
భగవంతుని ప్రేరణతో కనీసము అంచులు అంచాలుగా కొన్ని చిన్న చిన్న దేవస్థానాల జీర్ణోద్ధర పునర్నిర్మాణము చేసిన కొంతకాలమునకు భగవంతుని ప్రేరణతో ఈ క్షేత్రముపై ఎటువంటి కలి ప్రభావము పడకుండగా మరల క్షేత్ర ఆధాత్మిక , పౌరాణిక, ఐతిహాసిక వైభవమును పున స్థాపించు భగవత్ప్రేరణతో ఈ కార్యక్రమములో భాగముగా ప్రస్తుతము విజయనగర కాలములో శ్రీ కృష్ణదేవరాయల విజయ యాత్రకి ప్రతీకముగా నిర్మించిన శ్రీ విజయ విఠల శ్రీ గరుడ రథ
“శ్రీ విజయ విఠ్ఠల శ్రీ గరుడ రథ మందిర” పునర్నిర్మాణము “,
క్రొత్త హంపి గ్రామము దగ్గర క్రొత్త హంపి గ్రామముతో అనేక మూల దేవస్థానాలు పున: నిర్మాణము “నూతనముగా పున: స్థాపన” చేయు దివ్య కార్యము శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ పంపా విరుపాక్షశ్వర, శ్రీ రామచంద్రుల , శ్రీ బదరి నారాయణుల , శ్రీ ద్వారకా ధీశ శ్రీ కృష్ణ పరమాత్ముల, శ్రీ కిష్కిందా హనుమంతులవారి , శ్రీ వేదవ్యాసుల , శ్రీ ఆది శంకరాచార్యుల, శ్రీ విద్యారణ్యుల కృపతో , ప్రేరణతో శ్రీ స్వామివారు పూజ్య దీక్షా గురుదేవుల బదరి , ద్వారకా జగద్గురు శంకరాచార్యుల వారి ఆశీర్వాదములతో అనేక కార్యక్రమములు ఆరంభము అయినవి ,

ప్రస్తుత కార్యము ఇది కేవలము ఒక రథ మందిర పునర్నిర్మాణం మాత్రమే కాదు;
సనాతన “హిందూ మహాసామ్రాజ్య” ఆధ్యాత్మిక హృదయ వైభవ పునర్నిర్మాణము, విద్యా విజయనగర వీర వైభవ, పంపక్షేత్ర కిష్కింధా భగవద్ భక్తి వైభవ, , క్షేత్ర వైభవ పునర్నిర్మాణము, ఒక దివ్య దైవీ సంకల్పం

ఈ దైవీకార్యములో భక్తులకు ఈ ” స్వర్ణ విఠల రథ నిర్మాణ” సేవలో పాల్గొనుటకు భక్తులకు అవకాశము, వివిధ సేవా కైంకార్యములు వివరములు

పంపాక్షేత్ర కిష్కింధ హంపి వంటి పుణ్యక్షేత్రాలలో
శ్రీ విజయ విఠల రథం నూతనముగా పున: నిర్మాణము వంటి పవిత్ర కార్యములు అటువంటి వైభవములను, నిర్మాణాలను తిరిగి పున: నిర్మించడం ద్వారా సనాతన వైదిక ధర్మ , భక్తివైభవ ములను , మన పూర్వీకులు మనకి అందించిన ధార్మిక శిల్పకళను, వైభవాన్ని పునఃప్రతిష్ఠ